పులివెందులలోని భాకరాపురం క్యాంపు కార్యాలయంలో అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కడప నగర 66 డివిజన్ల కార్పొరేటర్ అభ్యర్థులు, ఇన్చార్జిలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికలకు సంబంధించి నాయకులకు జగన్ దిశానిర్దేశం చేశారు.
కడప నగర 66 డివిజన్ల కార్పొరేటర్ అభ్యర్థులు, ఇన్చార్జిలతో జరిగిన ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, కడప మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్, సీవీసీ సభ్యుడు కే. సురేష్ బాబు, మేయర్ అభ్యర్థి బండి దీప్తి, పలువురు నాయకులు పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాబోయే ఎన్నికల కార్యాచరణ, డివిజన్ల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, అభ్యర్థుల సమన్వయం, ప్రజలతో మమేకమై పనిచేయాల్సిన అంశాలపై వైఎస్ జగన్ నాయకులకు సూచనలు చేశారు.











