మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హత సాధించిన లబ్ధిదారులకు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, మణుగూరు, అక్టోబర్ 30: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, మణుగూరు, అక్టోబర్ 30: మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హత సాధించిన లబ్ధిదారులకు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం, పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని తెలిపారు. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో, నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్ల పథకం అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.












