పల్నాడు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో జరగనున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కృతిక శుక్ల తెలిపారు. పోలింగ్ సామగ్రి పంపిణీ, ఓట్ల లెక్కింపునకు అధికారులు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
జిల్లాలోని వినుకొండ, చిలకలూరిపేట, మాచర్ల, సత్తెనపల్లి మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించి, ఏర్పాట్లను సమీక్షించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జిల్లాలో మొత్తం 118 పోలింగ్ లొకేషన్లలో 308 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం 1,840 మంది సిబ్బందిని నియమించినట్లు కలెక్టర్ వెల్లడించారు. మొత్తం 156 వార్డుల్లో 398 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.











