కడప జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో, రైల్వే మండలం కె.బుడుగుంట పల్లెలో కమ్యూనిటీ మధ్యవర్తిత్వంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామగోపాల్ సూచనల మేరకు ఈ కార్యక్రమం జరిగింది.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ కం సీనియర్ సివిల్ జడ్జి ఎస్.బాబా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రజలకు న్యాయ సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో గ్రామాల్లో కమ్యూనిటీ మధ్యవర్తులను నియమించడం జరిగిందని సెక్రటరీ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తలెత్తే చిన్న చిన్న వివాదాలు, కుటుంబ సమస్యలు, భూమి, ఆస్తి తగాదాలను పరస్పర చర్చలు, సయోధ్య ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవచ్చని వివరించారు.












