భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డిని అధికారికంగా ఆహ్వానించారు. ఈ నెల 27న జరిగే తిరుకళ్యాణ మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా దేవాదాయ శాఖ ప్రతినిధులు, ఆలయ అర్చకులు ముఖ్యమంత్రిని కలిసి కోరారు.
ఈ ఉత్సవాలు ఈ నెల 19 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రికను అందజేసిన సందర్భంగా, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీమతి కొండా సురేఖ, శ్రీ తుమ్మల నాగేశ్వర రావు, శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాజ్యసభ సభ్యుడు శ్రీ వేం నరేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ డైరెక్టర్ శ్రీ హనుమంతరావు, ఆలయ ఈవో శ్రీ దామోదర్ రావు తదితరులు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భద్రాచలం ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించే తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.










