సదస్సు నేపథ్యంలో ప్రాధాన్యత
వచ్చే వారం చైనాలో జరగనున్న ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు () సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మరోసారి సమావేశం కానున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడితే అంతర్జాతీయ మార్కెట్లు, సరఫరా వ్యవస్థలు, పెట్టుబడులపై సానుకూల ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే, సుంకాల విషయంలో తుది ఒప్పందం ఇంకా ఖరారు కావాల్సి ఉంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
చైనా, అమెరికా మధ్య వాణిజ్య సంధిని మరో రెండు నెలలు పొడిగిస్తున్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా దిగుమతులపై విధించిన అదనపు 24 శాతం సుంకాల నిలిపివేతను కొనసాగించాలని నిర్ణయించింది. కీలక ఖనిజాలు, సాంకేతిక పరిజ్ఞానాల ఎగుమతులపై కొన్ని నియంత్రణల నుంచి ఇచ్చిన మినహాయింపులను 2027 జనవరి 10 వరకు పొడిగించింది.










