న్యూజిలాండ్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు నేషనల్, లేబర్ పార్టీల మధ్య స్వల్ప తేడాతో వెలువడటంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొంది.
న్యూజిలాండ్ పార్లమెంట్ ఎన్నికల్లో హోరాహోరీ పోటీ నెలకొంది. అధికార నేషనల్ పార్టీ, ప్రతిపక్ష లేబర్ పార్టీ మధ్య ఓట్ల శాతంలో స్వల్ప తేడా మాత్రమే కనిపించడంతో దేశంలో తదుపరి ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రాథమిక ఫలితాల ప్రకారం ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ నేతృత్వంలోని నేషనల్ పార్టీకి 42 స్థానాలు లభించగా, లేబర్ పార్టీకి 36 స్థానాలు వచ్చాయి. అయితే నేషనల్ పార్టీ, , న్యూజిలాండ్ ఫస్ట్ పార్టీలతో కూడిన కూటమికి మొత్తం 67 స్థానాలు దక్కాయి. 131 స్థానాలున్న పార్లమెంట్లో ప్రభుత్వ ఏర్పాటుకు 66 సీట్లు అవసరం.










