రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఉక్రెయిన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి 1.67 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంది.
రష్యాతో కొనసాగుతున్న యుద్ధం కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి () నుంచి భారీ ఆర్థిక సహాయం అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌కు సంబంధించిన నాలుగేళ్ల రుణ కార్యక్రమంపై సోమవారం కీలక సమీక్షను ప్రారంభించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సమీక్షలో రెండో, మూడో దశల అంచనాలను కలిపి పరిశీలించనున్నారు. సమీక్షకు ఆమోదం లభిస్తే ఉక్రెయిన్‌కు సుమారు 1.67 బిలియన్ డాలర్ల నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నిధులు యుద్ధంతో దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థకు కొంత ఊరటనివ్వనున్నాయి.











