గృహావసరాలైన వంట నూనె ధరలు అనూహ్యంగా పెరిగి సామాన్యులకు భారంగా మారాయి. సన్‌ఫ్లవర్, పల్లీ నూనెల ధరలు గణనీయంగా పెరగడంతో పాటు, సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి.
ఆన్లైన్ మార్కెట్లో సన్‌ఫ్లవర్ నూనె ధర లీటరుకు రూ.152 నుండి రూ.174-178కు ఎగబాకింది. ఆఫ్‌లైన్ మార్కెట్లో కూడా ధరలు రూ.165-168 మధ్య ఉన్నాయి. పల్లీ నూనె ధర రూ.220 దాటింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో, అనేక దుకాణాల్లో స్టాక్ అందుబాటులో లేదని బోర్డులు కనిపిస్తున్నాయి. ఇది వినియోగదారులలో ఆందోళన కలిగిస్తోంది.
గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు కొనసాగితే, దిగుమతులు తగ్గి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. ఇది ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపవచ్చు.










