తిరుపతిలోని గ్రాండ్ రిడ్జ్ హోటల్ వద్ద సోమవారం ఉదయం వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు. డ్రగ్స్ కేసులో పుట్టా మహేశ్ యాదవ్ పై చర్యలు తీసుకున్న తరహాలోనే, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిపై వచ్చిన ఆరోపణలపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
వైసీపీ నాయకులు అజయ్, పసుపులేటి సురేశ్, గీతా యాదవ్, రాజేంద్ర నేతృత్వంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పుట్టా మహేశ్ యాదవ్ పై వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ, బీఆర్ నాయుడిపై కూడా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ నేపథ్యంలో, సంఘటనా స్థలానికి చేరుకున్న టీడీపీ నేత జేబీ శ్రీనివాస్, వైసీపీ నాయకులతో వాగ్వాదానికి దిగారు. దీంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య స్వల్పంగా ఘర్షణ వాతావరణం నెలకొంది.










