హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఇంటి బయట ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికను చాక్లెట్ ఆశ చూపి కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, హత్య చేసిన సంఘటన కలకలం రేపింది.
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరేళ్ల బాలిక అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, ఒక వ్యక్తి చాక్లెట్ ఇస్తానని చెప్పి బాలికను తీసుకెళ్తున్నట్లు గుర్తించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు నేరం అంగీకరించినట్లు తెలిసింది. బాలికపై లైంగిక దాడికి పాల్పడి, అనంతరం గొంతు నులిమి హత్య చేసినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. నిందితుడు చూపిన ప్రదేశంలో బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.











