2026 ఏషియన్ గేమ్స్‌లో మహిళల క్రికెట్ క్వార్టర్ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, ఆతిథ్య జపాన్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. భారత స్పిన్నర్ శ్రీ చరణి అద్భుత బౌలింగ్‌తో జపాన్ బ్యాటింగ్‌ను కుప్పకూల్చగా, షఫాలీ వర్మ మెరుపు బ్యాటింగ్‌తో భారత్ లక్ష్యాన్ని కేవలం 5 ఓవర్లలోనే ఛేదించింది.
టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత స్పిన్నర్లు జపాన్ బ్యాటర్లను పరుగులు చేయకుండా కట్టడి చేశారు. మొత్తం 95 బంతుల్లో స్పిన్నర్లే వేయగా, భారత్‌కు చెందిన నలుగురు స్పిన్నర్లు కలిసి 8 వికెట్లు పడగొట్టారు. ఎడమచేతి వాటం స్పిన్నర్ శ్రీ చరణి తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. నాలుగు ఓవర్లలో కేవలం 10 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది. ఆమె బౌలింగ్‌లో ఏకంగా 20 డాట్ బాల్స్ ఉన్నాయి. షఫాలీ వర్మ 2 వికెట్లు తీయగా, దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్ చెరో వికెట్ సాధించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భారత బౌలర్ల ధాటికి జపాన్ 19.5 ఓవర్లలో కేవలం 57 పరుగులకే ఆలౌట్ అయింది. జపాన్ తరఫున ఓపెనర్ అయాకా కటో-స్టాఫర్డ్ 47 బంతుల్లో 25 పరుగులు చేసి కొంత ప్రతిఘటన చూపించింది. హరునా ఇవాసాకి మాత్రమే రెండంకెల స్కోరు సాధించింది. 58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు షఫాలీ వర్మ మెరుపు ఆరంభాన్ని అందించింది. కేవలం 15 బంతుల్లోనే అజేయంగా 40 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.











