రిలయన్స్ జియో రూ.10,000 ధరతో 1,095 రోజుల కాలపరిమితి కలిగిన కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు సుమారు మూడేళ్ల పాటు సేవలను పొందవచ్చు.
ఒకేసారి రీఛార్జ్ చేసుకుంటే 1,095 రోజుల పాటు సేవలు పొందవచ్చు. ఈ ప్లాన్‌లో రోజుకు 2.5 జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత 5జీ డేటా ప్రయోజనాలు ఉన్నాయి. అదనంగా జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్, 12 నెలల కాన్వా ప్రో లైట్, 50 జీబీ జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ వంటి ప్రయోజనాలను కూడా అందిస్తున్నారు. ఈ ప్లాన్‌ను మైజియో యాప్, జియో వెబ్సైట్, జియో స్టోర్లు, రిటైల్ దుకాణాల ద్వారా పొందవచ్చు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ ప్లాన్‌ను మూడేళ్లకు విభజిస్తే నెలకు సుమారు రూ.278 ఖర్చవుతుంది. ప్రస్తుతం ఉన్న రూ.3,599 వార్షిక ప్లాన్‌ను మూడుసార్లు తీసుకుంటే రూ.10,797 అవుతుండగా, కొత్త ప్లాన్ ద్వారా సుమారు రూ.797 ఆదా అవుతుంది. అయితే, కాన్వా ప్రో లైట్ ప్రయోజనం మొదటి 12 నెలలకే పరిమితం. అపరిమిత 5జీ డేటా పొందాలంటే 5జీ ఫోన్‌తో పాటు జియో 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉండాలి.











