మండల జడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) తరఫున పి. రెడ్డి వీరే గౌడ్ సతీమణి చిన్న వీరమ్మ నామినేషన్ దాఖలు చేశారు. నిమ్మనపల్లి రోడ్డులోని జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో ఆమె తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
గంపనపల్లి, పూలపాడు, , మినికి గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు మద్దతుగా నిలిచారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అభ్యర్థి ప్రకటన
ఈ సందర్భంగా పి. రెడ్డి వీరే గౌడ్ మాట్లాడుతూ, వైసీపీ అభ్యర్థిగా చిన్న వీరమ్మ మండల జడ్పీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. మండలంలోని గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు.











