అన్నమయ్య, 12 September
జిల్లాలోని చారిత్రాత్మక గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయాన్ని రాజంపేట శాసనసభ్యులు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
చారిత్రిక గుడిమల్లం ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే ఆకేపాటి: డిస్ట్రిక్ట్ బ్యూరో చీఫ్ డాక్షిన్ టైమ్స్ 12. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటి అతి పురాతన, చారిత్రాత్మక శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, రాజంపేట శాసనసభ్యులు శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుడిమల్లం క్షేత్రంలోని స్వయంభూ శ్రీ పరశురామేశ్వర శివలింగానికి ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకాలు, పూజలు జరిపారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కుటుంబ సభ్యులకు తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకేపాటి మాట్లాడుతూ... ప్రపంచంలోనే ఎంతో విశిష్టత కలిగిన అత్యంత పురాతనమైన గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామివారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. రాజంపేట నియోజకవర్గ ప్రజలతో పాటు, రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులు మరియు అభిమానులు పాల్గొన్నారు.










