కామారెడ్డి, 12 September
కామారెడ్డి జిల్లా లింగాయపల్లి గ్రామంలో డీజే ఏర్పాటు చేసి అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బంది కలిగించిన ఘటనపై దేవునిపల్లి పోలీసులు చర్యలు చేపట్టారు. డీజే యజమానిపై కేసు నమోదు చేసి, డీజేను సీజ్ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
లింగాయపల్లిలో డీజే సీజ్.. యజమానిపై కేసు కామారెడ్డి: జిల్లాలోని లింగాయపల్లి గ్రామంలో డీజే ఏర్పాటు చేసి అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బంది కలిగించిన ఘటనపై దేవునిపల్లి పోలీసులు చర్యలు చేపట్టారు. గ్రామంలో డీజే ద్వారా పెద్ద శబ్దాలు చేస్తూ ప్రజలకు డిస్టర్బ్ కలిగిస్తున్నట్లు పోలీసుల దృష్టికి రావడంతో వెంటనే స్పందించారు. డీజే యజమానిపై కేసు నమోదు చేసి, డీజేను సీజ్ చేశారు. ఈ మేరకు దేవునిపల్లి ఎస్సై రంజిత్ పత్రికా ప్రకటనలో తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా అధిక శబ్దంతో డీజేలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సూచించారు.






