కామారెడ్డి, 7 September
రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వినాయక విగ్రహాల ఊరేగింపు సమయంలో కొత్తగా నిర్వహిస్తున్న ఆగమన్ కార్యక్రమాలకు ఎలాంటి అనుమతులు లేవని కామారెడ్డి పట్టణ సీఐ నరహరి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎవరూ ఆగమన్ కార్యక్రమాలను నిర్వహించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆగమన్ కార్యక్రమాలకు అనుమతి లేదు: పట్టణ సీఐ నరహరి కామారెడ్డి: రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వినాయక విగ్రహాలను తీసుకువచ్చే సమయంలో కొత్తగా నిర్వహిస్తున్న "ఆగమన్" కార్యక్రమాలకు ఎలాంటి అనుమతులు లేవని కామారెడ్డి పట్టణ సీఐ నరహరి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి పట్టణ ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఎవరూ ఆగమన్ కార్యక్రమాలను నిర్వహించరాదని ఆయన విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీసు శాఖ సూచనలను పాటించి, ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అందరూ సహకరించాలని సీఐ కోరారు.












