అంతరిక్ష వ్యర్థాలను తొలగించే టెక్నాలజీకి హైదరాబాద్ వేదికగా మారింది. నగరంలోని గచ్చిబౌలి వీఎస్డీ టెక్ పార్క్‌లో సంస్థ ఏర్పాటు చేసిన బేస్ 1 కేంద్రాన్ని న ప్రారంభించారు. ఇది భారతదేశంలోనే తొలి ప్రైవేట్ స్పేస్ డెబ్రిస్ రిమూవల్, శాటిలైట్ సర్వీసింగ్ సదుపాయం.
సుమారు 14,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో అంతరిక్ష రోబోలను రూపొందించడం, నిర్మించడం, పరీక్షించడం, వాటి కార్యకలాపాలను పర్యవేక్షించడం వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇందులో ఆర్బిటల్ క్యాప్చర్ ల్యాబ్, స్పేస్ రోబోటిక్స్ ల్యాబ్, శాటిలైట్ ఇంటిగ్రేషన్ క్లీన్ రూమ్, మిషన్ సిమ్యులేషన్ అండ్ కంట్రోల్ సెంటర్ వంటి నాలుగు ప్రధాన విభాగాలు ఉన్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అంతరిక్ష వ్యర్థాల తొలగింపుతో పాటు ఉపగ్రహ మరమ్మతులు
ఈ కేంద్రం ద్వారా కేవలం అంతరిక్ష వ్యర్థాలను తొలగించే సాంకేతికత మాత్రమే కాకుండా, కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలకు మరమ్మతులు చేయడం, ఇంధనం నింపడం వంటి సేవల అభివృద్ధిపైనా దృష్టి పెట్టనున్నారు. రూపొందిస్తున్న ప్రత్యేక డ్యూయల్ స్పేస్‌క్రాఫ్ట్ విధానంలో రెండు అంతరిక్ష నౌకల సాయంతో గరిష్ఠంగా 100 ఉపగ్రహాలకు సేవలు అందించే లక్ష్యం ఉంది. దీనివల్ల ఒక్కో ఉపగ్రహానికి అయ్యే సర్వీసింగ్ ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చని సంస్థ అంచనా వేస్తోంది.












