ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారిని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించే నిబంధనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మారుతున్న జనాభా పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి నిబంధనలు తమ ప్రాసంగికతను కోల్పోయాయని అభిప్రాయపడింది. 2003 నాటి తీర్పును పునఃపరిశీలించేందుకు ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి పంపించింది.
జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధే ధర్మాసనం మహారాష్ట్రకు చెందిన మాజీ సర్పంచ్ మంగళ భీంరావు ఇంగ్లే దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. మూడో సంతానం ఉన్న కారణంగా ఆమె సర్పంచ్ ఎన్నిక చెల్లదంటూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గత తీర్పు, ప్రస్తుత పరిస్థితులు
2003లో జావేద్ వర్సెస్ హర్యానా రాష్ట్రం కేసులో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారిని పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించే నిబంధనను సుప్రీంకోర్టు సమర్థించింది. ఇప్పుడు ఆ తీర్పును ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని తాజా ధర్మాసనం పేర్కొంది.












