బొకారో
జార్ఖండ్‌లోని జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ()కు చెందిన కథారా బొగ్గు గనిలో భారీ బొగ్గు కుప్ప కూలిపోవడంతో ముగ్గురు మహిళలు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కథారా కొలియరీలోని ఐదో స్టాక్‌యార్డులో తెల్లవారుజామున 4.45 గంటల ప్రాంతంలో ఈ విషాదం జరిగింది. సమీప గ్రామాలకు చెందిన ఏడుగురు వ్యక్తులు, ఇంటి అవసరాల కోసం మిగిలిపోయిన బొగ్గును సేకరిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా భారీ బొగ్గు కుప్ప వారిపై కూలిపోయింది.












