గంజాం
ఒడిశాలో వరద బాధితులకు సహాయక సామగ్రి పంపిణీ విషయంలో తలెత్తిన వివాదం రాజకీయ దుమారానికి దారితీసింది. విధుల్లో ఉన్న ఐఏఎస్ అధికారిని బీజేపీ ఎమ్మెల్యే దుర్భాషలాడటంతో పాటు చంపేస్తానని బెదిరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు అందింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జిల్లా పరిషత్ ముఖ్య అభివృద్ధి అధికారి సమీర్ కుమార్ జెనా ఈ మేరకు అసికా పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. న అసికా మున్సిపల్ కార్యాలయంలోని ఓ ఛాంబర్లో తాను ఉన్న సమయంలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సరోజ్ పాధి అక్కడికి వచ్చి వరద సహాయక సామగ్రి పంపిణీపై నిలదీశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.












