జార్ఖండ్ ఆరోగ్యశాఖ మంత్రి ఇర్ఫాన్ అన్సారీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. దేశంలో పరిస్థితులు బంగ్లాదేశ్, నేపాల్ కంటే దారుణంగా మారవచ్చని, 40 లక్షల మంది యువత రాహుల్ గాంధీ పిలుపు కోసం ఎదురుచూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించగా, మంత్రి మాత్రం అలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఖండించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల సమస్యలను పట్టించుకోకపోతే దేశంలో అత్యవసర పరిస్థితులను తలపించే పరిణామాలు చోటుచేసుకోవచ్చని, పరిస్థితులు బంగ్లాదేశ్, నేపాల్ కంటే దారుణంగా మారవచ్చని ఆయన హెచ్చరించినట్లు కథనాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బీజేపీ తీవ్ర అభ్యంతరం, పోలీసులకు ఫిర్యాదు
మంత్రి వ్యాఖ్యలపై జార్ఖండ్ బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశంలో అశాంతిని ప్రోత్సహించేలా మాట్లాడారని ఆరోపిస్తూ ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు దీపక్ ప్రకాశ్ రాంచీలోని అర్గోరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, ఇర్ఫాన్ అన్సారీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు నిరసనలు చేపట్టి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేశారు.










