కడప, జూన్ 26
డ్రగ్స్ రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా కడప నగరంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో 'నషా ముక్త్ భారత్ అభియాన్' కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాధ్ ఐపిఎస్ ముఖ్య అతిధిగా హాజరై, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
డ్రగ్స్ రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా కడప నగరంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో 'నషా ముక్త్ భారత్ అభియాన్' కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాధ్ ఐపిఎస్ ముఖ్య అతిధిగా హాజరై, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, డ్రగ్స్ రహిత సమాజ స్థాపనే ప్రతీ ఒక్కరి లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు.
జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాధ్ ఐపిఎస్ మాట్లాడుతూ - జిల్లా వ్యాప్తంగా 'నషా ముక్త్ భారత్ అభియాన్' కార్యక్రమాలను చేపడుతూ, గంజాయి, డ్రగ్స్ వంటి నిషేధిత మత్తు పదార్థాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు, యువతకు వివరిస్తూ, అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా నేడు ప్రజలకు, యువతకు అవగాహన కల్పించేందుకు నగరంలో సిగ్నేచర్ క్యాంపైన్ తో పాటు వాకథాన్ అవేర్ నెస్ ర్యాలీని చేపట్టామన్నారు.
ఎన్డిపిఎస్ చట్టం చాలా కఠినమైన చట్టమని, డ్రగ్స్ వాడడం, అమ్మడం, అక్రమ రవాణా చేయడం, కొనుగోలు చేయడం వీటన్నిటికీ చాలా కఠినమైన శిక్షలున్నాయన్నారు. జిల్లా పోలీస్ శాఖ నిరంతరం నిఘా ఉంచడం జరిగిందని, సోషల్ మీడియా, అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ ల వద్ద సాంకేతికమైన, మానవ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా నిరంతర నిఘా కొనసాగుతోందన్నారు.












