తిరుపతి, జూన్ 25
తిరుచానూరు ఎస్ఐ సుమతిపై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఆమెను వీఆర్‌కు బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. రెండు రోజుల క్రితం రాత్రి విధుల్లో ఉన్న సమయంలో ఎస్ఐ ప్రజలతో అమర్యాదగా ప్రవర్తించారనే ఫిర్యాదులు వచ్చాయి.
తిరుచానూరు ఎస్ఐ సుమతిపై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఆమెను వీఆర్‌కు బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.
రెండు రోజుల క్రితం రాత్రి విధుల్లో ఉన్న సమయంలో ఎస్ఐ ప్రజలతో అమర్యాదగా ప్రవర్తించారనే ఫిర్యాదులు వచ్చాయి. కానిస్టేబుళ్లతో కలిసి ఆమె ప్రజలను తీవ్రంగా హెచ్చరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపిన ఉన్నతాధికారులు, క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు.












