కామారెడ్డి, 04-08-2026
లింగంపేట మండలం లింగంపల్లి కుర్దు గ్రామం వద్ద వరదల కారణంగా దెబ్బతిన్న తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా పనులను వేగంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
లింగంపేట మండలం లింగంపల్లి కుర్దు గ్రామం వద్ద ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా పనులను వేగంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వంతెన పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. పనుల నిర్వహణలో నాణ్యతకు ఎలాంటి రాజీ పడకూడదని, భవిష్యత్తులో కూడా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బలమైన నిర్మాణ ప్రమాణాలను పాటించాలని సూచించారు.
వంతెన మరమ్మతు పనులు పూర్తయ్యే వరకు గ్రామస్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు, అవసరమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయాలని రెవెన్యూ, పోలీసు మరియు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజల ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు.











