కామారెడ్డి, 2026-08-05
ప్రజల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజావాణిలో స్వీకరించే ప్రతి వినతిని నిర్దేశిత గడువులోగా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 80 దరఖాస్తులను స్వీకరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రజల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజావాణిలో స్వీకరించే ప్రతి వినతిని నిర్దేశిత గడువులోగా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 80 దరఖాస్తులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. భూ సమస్యలు, రెవెన్యూ అంశాలు, సంక్షేమ పథకాలు, పెన్షన్లు, ఉపాధి, ఇతర శాఖలకు సంబంధించిన వినతులను ప్రజలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.












