ప్రముఖ శీతల పానీయాల సంస్థ కోకాకోలాకు చెందిన భారత బాట్లింగ్ వ్యాపార మాతృసంస్థ హిందుస్థాన్ కోకాకోలా హోల్డింగ్స్ లిమిటెడ్ () పబ్లిక్ ఇష్యూకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ () సమర్పించింది. ఈ ఐపీఓ ద్వారా ప్రమోటర్ సంస్థ తన వద్ద ఉన్న 99.75 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది.
ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ విధానంలో ఉండనుంది. అంటే కంపెనీ కొత్తగా షేర్లు జారీ చేయడం లేదు. ప్రమోటర్ సంస్థ హిందుస్థాన్ కోకాకోలా ఓవర్సీస్ హోల్డింగ్స్ పీటీఈ లిమిటెడ్ తన వద్ద ఉన్న షేర్లను విక్రయించనుంది. అందువల్ల ఐపీఓ ద్వారా వచ్చే మొత్తం నిధులు విక్రయించే ప్రమోటర్‌కే వెళ్తాయి. కి ఈ ఇష్యూ ద్వారా నేరుగా కొత్త పెట్టుబడి అందదు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వాటాల వివరాలు
ప్రస్తుతం లో కోకాకోలా సంస్థకు 60 శాతం వాటా ఉండగా, జూబిలెంట్ బెవరేజెస్‌కు 40 శాతం వాటా ఉంది. 2025లో జూబిలెంట్ భర్తియా గ్రూప్ కోకాకోలా భారత బాట్లింగ్ వ్యాపారంలో 40 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో తాజా ఐపీఓ సంస్థ యాజమాన్య నిర్మాణంలో మరో కీలక పరిణామంగా నిలుస్తోంది.











