అమెరికాలో ప్రముఖ క్యాన్సర్ పరిశోధకురాలిగా పేరొందిన భారతీయ సంతతికి చెందిన డాక్టర్ రచనా ష్రాఫ్ 47 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. క్లోమం, పిత్త వాహికల క్యాన్సర్లపై పరిశోధనకు తన జీవితాన్ని అంకితం చేసిన ఆమె, చివరకు అదే వ్యాధితో పోరాడుతూ మరణించడం వైద్య ప్రపంచాన్ని విషాదంలో ముంచింది.
అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ (), అరిజోనా విశ్వవిద్యాలయం ఆమె మరణాన్ని ధృవీకరించాయి. ఆమె యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా క్యాన్సర్ సెంటర్లో ప్రముఖ వైద్యురాలు, పరిశోధకురాలు. జీర్ణవ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్లు, ముఖ్యంగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, పిత్త వాహికల క్యాన్సర్ల చికిత్సపై ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉన్నారు. యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా వైద్య కళాశాలలో హెమటాలజీ, ఆంకాలజీ విభాగానికి అధిపతిగా పనిచేశారు. క్యాన్సర్ చికిత్సకు కొత్త మార్గాలను కనుగొనేందుకు అనేక క్లినికల్ ట్రయల్స్‌కు నాయకత్వం వహించారు. ఆమె తన కెరీర్లో 80కి పైగా శాస్త్రీయ పరిశోధనా పత్రాలను ప్రచురించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
2026లో ఆమె ఆరోగ్య సమస్య ప్రారంభమైనప్పుడు మెడ వద్ద శోషరస గ్రంథి ( ) వాపును గుర్తించారు. మొదట వైద్యులు దానిని లింఫోమా అనే రక్త క్యాన్సర్‌గా అనుమానించారు. అయితే తదుపరి పరీక్షల్లో ఆమెకు అడ్వాన్స్డ్ అడెనోకార్సినోమా () ఉన్నట్లు తెలిసింది. ఈ క్యాన్సర్ అప్పటికే శరీరంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించినట్లు నివేదికలు తెలిపాయి. అడెనోకార్సినోమా అనేది శరీరంలోని వివిధ అవయవాల లోపలి భాగాల్లో ఉండే గ్రంథి కణజాలం నుంచి ప్రారంభమయ్యే క్యాన్సర్ రకం. రచనా ష్రాఫ్ తన కెరీర్లో ప్యాంక్రియాటిక్, పిత్త వాహికల క్యాన్సర్లకు మెరుగైన చికిత్సలు కనుగొనేందుకు నిరంతరం కృషి చేశారు. ఈ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు కొత్త చికిత్సలు అందుబాటులోకి తీసుకురావడానికి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. అయినప్పటికీ, ఆమె స్వయంగా తీవ్రమైన క్యాన్సర్‌తో పోరాడాల్సి వచ్చింది. అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ ఆమెను రోగుల జీవితాలను మెరుగుపరచడానికి కృషి చేసిన వైద్యురాలిగా స్మరించుకుంది.











