బిబిపేట్, 8 September
మండలం మాందాపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీని కలిసి, గ్రామంలోని అభివృద్ధి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని షబ్బీర్ అలీ హామీ ఇచ్చారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మాందాపూర్ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానన్న షబ్బీర్ అలీ హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీని మండలం మాందాపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి గ్రామంలోని పలు అభివృద్ధి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. గ్రామానికి అవసరమైన సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి కావాల్సిన నిధులు మంజూరు చేయించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని షబ్బీర్ అలీ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా చూడాలని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. అలాగే ప్రజలకు ఆస్పత్రుల్లో ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాత రాజు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతర్ల మోహన్ రెడ్డి, పందిరి రాజిరెడ్డి, చింతకుంట రాజు, మోతె భాస్కర్ రెడ్డి, కమ్మరి గంగారాం, రాజేశ్వర్ రెడ్డి, వార్డు సభ్యులు శివనూరి నర్సింలు, రొడ్డ లావణ్య బాబు, సడుగు సామెల్, ప్రభాకర్, మహేశ్ మహరాజ్ తదితరులు పాల్గొన్నారు.











