పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన నివాసంలో నిర్వహించిన కాళీపూజ సందర్భంగా పూలు సమర్పించిన తీరు రాజకీయ వివాదానికి కారణమైంది. ఆమె పూజకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో బీజేపీ విమర్శలు గుప్పించింది.
వైరల్ వీడియోలో మమతా బెనర్జీ దేవికి పూలు సమర్పిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఆమె పూలను భక్తితో సమర్పించకుండా విసిరినట్లుగా వ్యవహరించారంటూ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దేవతలకు పూలు భక్తి, గౌరవంతో సమర్పించాలని, విసరడం తగదని పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో విమర్శించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ వ్యవహారంపై మాజీ బీజేపీ నేత అనుపమ్ హజ్రా కూడా స్పందిస్తూ మమతా బెనర్జీని విమర్శించారు. దీంతో ఈ వీడియోపై రాజకీయ వర్గాలతో పాటు సోషల్ మీడియాలోనూ చర్చ మొదలైంది.










