ముంబైలోని మలాడ్‌లో బాణసంచా నిల్వ చేసిన దుకాణంలో భారీ పేలుడు సంభవించి, పైకప్పు కూలిపోవడంతో 16 ఏళ్ల బాలుడు సజీవదహనమయ్యాడు. రాత్రి జరిగిన ఈ ఘటనలో దుకాణంలో మంటలు చెలరేగి, తీవ్ర నష్టం వాటిల్లింది.
ముంబైలో దీపావళి వేడుకల సందడి కొనసాగుతుండగానే విషాదం చోటుచేసుకుంది. బాణసంచా నిల్వ చేసిన ఓ దుకాణంలో పేలుడు సంభవించి మంటలు చెలరేగడంతో 16 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. పేలుడు ధాటికి దుకాణం పైకప్పు కూలిపోవడంతో బాలుడు లోపలే చిక్కుకుపోయాడు. చివరకు అతడి మృతదేహాన్ని అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాత్రి 9.56 గంటలకు ప్రమాదం
ముంబైలోని మలాడ్ పశ్చిమ ప్రాంతం, మాల్వాణిలోని అబ్దుల్ హమీద్ మార్గ్‌లో గేట్ నంబర్ 8 సమీపంలో ఈ ఘటన జరిగింది. రాత్రి 9.56 గంటల సమయంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న దుకాణంలో మంటలు చెలరేగాయి. దుకాణంలో బాణసంచాతో పాటు విద్యుత్ వైర్లు, ఇతర విద్యుత్ పరికరాలు కూడా ఉన్నాయి.











