నంద్యాల, జూలై 01
పేద ప్రజల ఆపదలో ఆదుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి మనసుకు నిదర్శనమని నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ అన్నారు. మంత్రి ఫరూక్ క్యాంపు కార్యాలయంలో 22,13,716 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
పేద ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు 'నేనున్నాను' అని ఆదుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి మనసుకు నిదర్శనమని నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ అన్నారు. మంత్రి ఫరూక్ క్యాంపు కార్యాలయంలో (రాజ్ టాకీస్) నందు 22,13,716 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ, ఎక్కువ యాక్సిడెంట్లు, అనారోగ్య కారణాల వల్ల వచ్చే వారికి ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త వహించకుండా జాగ్రత్తలు వహించాలని, ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పేద ప్రజలు ఏదైనా ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నా, లేదా ఆరోగ్య పరంగా ప్రాణాల మీదకు వచ్చినప్పుడు అత్యవసరంగా ఆపరేషన్లకు కావల్సిన డబ్బులు లేకపోవడం, వారి స్థోమతకు మించి ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు మంత్రి ఫరూక్ కు విన్నవించుకున్న సందర్భంలో వారి ఆవేదన విని, అప్పటికప్పుడు దగ్గరుండి సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేయించారన్నారు.
అలా పేదవారి ఆపరేషన్ల ఖర్చుకు సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 22 మంది బాధిత కుటుంబ సభ్యులకు వచ్చిన 22 లక్షల 13 వేల 716 రూపాయలను చెక్కుల రూపంలో నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.











