జపాన్‌లోని ఐచినగోయా వేదికగా జరుగుతున్న 2026 పారా ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. ఐదో రోజు పోటీలకే 114 పతకాలు సాధించి, గత రికార్డులను అధిగమించారు. ఇందులో పలు స్వర్ణ పతకాలతో పాటు ప్రపంచ రికార్డులు కూడా ఉన్నాయి.
2026 పారా ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఐదో రోజు పోటీల్లోనే భారత్ ఖాతాలో మరో 25 పతకాలు చేరాయి. వీటిలో తొమ్మిది స్వర్ణ పతకాలు సాధించడం విశేషం. దీంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 114కు చేరింది. గతంలో 2023లో జరిగిన పారా ఆసియా క్రీడల్లో భారత్ 108 పతకాలు సాధించగా, ఈసారి ఆ రికార్డును అధిగమించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
స్వర్ణ పతకాలతో మెరిసిన భారత క్రీడాకారులు
ఆర్చరీలో హర్వీందర్ సింగ్విజయ్ సుంది జోడీ పురుషుల రికర్వ్ డబుల్స్ ఫైనల్లో చైనా జోడీపై 51 తేడాతో విజయం సాధించి స్వర్ణం గెలుచుకుంది. షూటింగ్లో మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఎస్‌హెచ్1 విభాగంలో మోనా అగర్వాల్ 357.5 పాయింట్లతో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.











