కామారెడ్డి, 2026-08-06
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని ఎండ్రియాల్ గ్రామంలో ప్లాస్టిక్ రహిత గ్రామాల ఏర్పాటులో భాగంగా పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించి, ప్రతి ఇంటికి జ్యూట్ సంచులను పంపిణీ చేశారు.

ప్లాస్టిక్ వాడకం దుష్పరిణామాలు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు నేల సారాన్ని దెబ్బతీయడంతో పాటు నీటి వనరులను కలుషితం చేస్తున్నాయని తెలిపారు. పశువులు ప్లాస్టిక్‌ను తినడం వల్ల వాటి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని, ప్లాస్టిక్‌ను కాల్చడం వల్ల వెలువడే విషపూరిత వాయువులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వినియోగం కారణంగా కాలువలు మూసుకుపోయి పారిశుధ్య సమస్యలు, దోమల వ్యాప్తి, వివిధ వ్యాధులు పెరిగే ప్రమాదం ఉందని వివరించారు.