కామారెడ్డి, 2026-08-06
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

జయశంకర్ కృషి స్ఫూర్తిదాయకం
ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆచార్య జయశంకర్ సార్ జీవితాంతం చేసిన కృషి, ఆయన చూపిన మార్గం చిరస్మరణీయమని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ఆయన అందించిన సిద్ధాంతపరమైన బలం, ఉద్యమానికి చేసిన సేవలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.
సమాజాభివృద్ధికి కృషి చేయాలి
జయశంకర్ సార్ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొని జయశంకర్ సార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు.