హీరో నాని తన తాజా చిత్రం ది ప్యారడైజ్ విడుదల సందర్భంగా అభిమానులతో కలిసి థియేటర్లో సినిమా చూడాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో గల ఒక థియేటర్లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎక్స్ వేదికగా కోరారు.
సినిమాను ప్రేక్షకులతో కలిసి థియేటర్లో చూడటం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతినిస్తుందని నాని పేర్కొన్నారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ ప్రాంతం హైదరాబాద్ సినీ అభిమానులకు ఎంతో ప్రత్యేకమైనదని, తాను నటించిన సినిమాను తాను అభిమానించే ప్రేక్షకులతో కలిసి వీక్షించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అదే సమయంలో, ప్రజల భద్రతకు సంబంధించిన అన్ని నిబంధనలు, మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తామని నాని స్పష్టం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నాని విజ్ఞప్తిపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి, స్థానిక పోలీస్ స్టేషన్లో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భారీగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, జన సమీకరణ, భద్రత, ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పరిస్థితిని సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.











