ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మరోసారి వివాదంలో చిక్కుకుంది. నామినేషన్ల సమయంలో అభ్యర్థులను అడ్డుకున్నారనే ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సుప్రీంకోర్టు ఆదేశాలను సరిగా అమలు చేయలేదని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై ప్రశ్నలు లేవనెత్తుతూ ఈ అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
సుప్రీంకోర్టు ఆదేశాల ఉద్దేశం ఫిర్యాదులను పరిశీలించి, నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్న సందర్భాల్లో అభ్యర్థులకు మరో అవకాశం కల్పించడమే. ఆరోపణలు చేసినంత మాత్రాన అవి నిరూపితమైనట్లుగా పరిగణించరాదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వైఎస్సార్సీపీ కోరిన ప్రధాన చర్యలు
లేళ్ల అప్పిరెడ్డి సమర్పించిన ఫిర్యాదుల్లో ప్రధానంగా ఈ అంశాలు ఉన్నాయి: ధర్మవరం గ్రామ మండలం, ముదిగుబ్బ, తాడిమర్రి, బత్తలపల్లి మండలాల్లో అదనపు భద్రత కల్పించాలని, తిరుపతి జిల్లా పెల్లకూరు మండలంలోని పునబాక, చిల్లకూరు గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ ఓటర్లకు రక్షణ కల్పించాలని, శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలోని 56, 57, 58, 59 పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయాలని, మార్కాపురం జిల్లాలోని హనుమంతునిపాడు మండలంలోని సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని, తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు, రామచంద్రాపురం మండలాల్లో కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించాలని, పలమనేరు నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల్లో అదనపు పోలీసు బలగాలు, వంద శాతం వెబ్‌కాస్టింగ్, సీసీటీవీ ఏర్పాటు చేయాలని, పెల్లకూరు మండలంలో అధికారికంగా నియమించిన పోలింగ్ ఏజెంట్లను అన్ని కేంద్రాల్లోకి అనుమతించాలని కోరారు.












