బాల్కొండ, 2026-06-05
తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును విస్తృతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వరికి ప్రత్యామ్నాయంగా ఈ పంట వైపు రైతులను ప్రోత్సహించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. బాల్కొండలో మెగా ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించి, రైతులకు అందుతున్న ప్రోత్సాహకాలను అధికారులు వివరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుత ఎల్-నినో పరిస్థితుల నేపథ్యంలో వరికి ప్రత్యామ్నాయంగా రైతులను ఆయిల్ పామ్ సాగువైపు మళ్లించేందుకు ప్రభుత్వం విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. ఇందులో భాగంగా జిల్లా ఉద్యాన శాఖ, ప్రీ యూనిక్ ఆయిల్ పామ్ కంపెనీ సంయుక్తంగా మెగా ప్లాంటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించాయి.










