విజయవాడ గ్రామీణం, జూన్ 30
దేశ విద్యావ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. విజయవాడలో 'ఛాత్రోన్ కీ గూంజ్' (విద్యార్థుల గర్జన) కార్యక్రమం నిర్వహించారు. పరీక్షా పత్రాల లీకులు, నియామకాల్లో జాప్యంపై యూత్ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.
దేశ విద్యావ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్ కాంగ్రెస్ కార్యాలయంలో 'ఛాత్రోన్ కీ గూంజ్' (విద్యార్థుల గర్జన) కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా డోన్ నుంచి తెలుగు విజయ్ కుమార్ పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి నాగ మధు యాదవ్, ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రామారావు, నూతనంగా నియమితులైన నూనె పవన్ తేజ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలుగు విజయ్ కుమార్ లు మోదీ ప్రభుత్వ హయాంలో జరిగిన పరీక్షా పత్రాల లీకులు, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు, నియామక ప్రక్రియల్లో జాప్యాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
నీట్ పరీక్షా పత్రం లీక్ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారని, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం విద్యార్థులకు ఎలాంటి హామీలు ఇవ్వడం లేదని ఆరోపించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు తమ పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు.












