2026 ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. భారత్, అఫ్గానిస్థాన్ల మధ్య జరగాల్సిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌కు భారీ వర్షం అంతరాయం కలిగించింది. వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు చేశారు. టోర్నీ నిబంధనల ప్రకారం, మెరుగైన అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్ కలిగిన భారత్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
జపాన్‌లోని నిష్షిన్ నగరంలో కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, ఉదయం నుంచే ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో మైదానం పూర్తిగా తడిసిపోయింది. టాస్ కూడా సాధ్యం కాలేదు. పరిస్థితులు మెరుగుపడే అవకాశం లేకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ర్యాంకింగ్‌తో భారత్‌కు సెమీస్ బెర్త్
నాకౌట్ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దయి, ఆట నిర్వహించే అవకాశం లేకపోతే మెరుగైన ర్యాంకింగ్ ఉన్న జట్టును తదుపరి దశకు పంపే నిబంధన ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానంలో ఉండగా, అఫ్గానిస్థాన్ 10వ స్థానంలో ఉంది. దీంతో మ్యాచ్ రద్దయినప్పటికీ భారత్ సెమీఫైనల్‌కు చేరింది.











