2026 యూత్ ఒలింపిక్స్‌లో భారత యువ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు. సెనెగల్‌లోని డాకర్లో జరుగుతున్న ఈ పోటీల్లో ఒకే రోజు భారత్‌కు రెండు పతకాలు లభించాయి. జూడోలో ఖుష్బూ రాజక్భాయ్ రజత పతకం సాధించగా, స్విమ్మింగ్‌లో ధినిధి దేశింగు కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
భారత జూడో క్రీడాకారిణి ఖుష్బూ రాజక్భాయ్ మహిళల 63 కేజీల విభాగంలో రజత పతకం సాధించింది. ఫైనల్లో జర్మనీకి చెందిన జోలినా రైన్హోల్డ్ చేతిలో ఓటమి పాలైంది. కేవలం 48 సెకన్లలోనే ప్రత్యర్థి ఇప్పాన్ () ద్వారా విజయం సాధించింది. అయినప్పటికీ ఖుష్బూ రజత పతకంతో భారత్‌కు గర్వకారణంగా నిలిచింది. యూత్ ఒలింపిక్స్‌లో జూడోలో పతకం సాధించిన రెండో భారత క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
స్విమ్మింగ్‌లో ధినిధికి కాంస్యం
మరోవైపు భారత స్విమ్మర్ ధినిధి దేశింగు మహిళల 100 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆమె 56.27 సెకన్లలో రేసును పూర్తి చేసింది. క్రొయేషియాకు చెందిన అనా బోబనోవిచ్ 55.89 సెకన్లతో స్వర్ణం, న్యూజిలాండ్‌కు చెందిన అలిస్సా లాసన్ 56.13 సెకన్లతో రజతం సాధించారు.












