చెన్నై ఓపెన్ డబ్ల్యూటీఏ 250 టెన్నిస్ టోర్నమెంట్ అర్హత పోటీల్లో భారత క్రీడాకారిణులకు నిరాశ ఎదురైంది. భారత ప్లేయర్లు భామిడిపాటి, శ్రీవల్లి, రష్మిక క్వాలిఫయింగ్ రౌండ్లో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు. ప్రధాన టోర్నీకి అర్హత సాధించాలన్న వారి ప్రయత్నాలు ఫలించలేదు.
చెన్నైలోని ఎస్‌డీఏటీ టెన్నిస్ స్టేడియంలో జరిగిన తొలి రౌండ్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో శ్రీవల్లి భామిడిపాటి స్లోవేకియా క్రీడాకారిణి విక్టోరియా మోర్వాయోవా చేతిలో 2-6, 3-6తో ఓడిపోయింది. మరో భారత క్రీడాకారిణి జీల్ దేశాయ్, జపాన్ క్రీడాకారిణి మెయి యమగుచీ చేతిలో 1-6, 0-6తో పరాజయం పాలైంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వైల్డ్‌కార్డ్ ద్వారా అర్హత పోటీల్లో పాల్గొన్న దియా రమేశ్, జపాన్‌కు చెందిన రెండో సీడ్ క్రీడాకారిణి క్యోకా ఒకమురా చేతిలో 4-6, 2-6తో ఓడింది. 14 ఏళ్ల జెన్సీ కనబార్ పోలాండ్ క్రీడాకారిణి వెరోనికా ఫాల్కోవ్స్కాపై ఒక సెట్ గెలిచి పోరాడినా.. చివరకు 2-6, 7-5, 3-6తో ఓటమి చవిచూసింది. దీంతో అర్హత పోటీల్లో పాల్గొన్న నలుగురు భారతీయులూ ప్రధాన డ్రాకు చేరుకోలేకపోయారు.












