కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, మోసాలు, అన్యాయాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ, దానిపై నిరసనగా 'వెన్నుపోటు దినం'గా ప్రజలకు గుర్తుచేస్తూ, రాబోయే 12వ తేదీన బైక్ ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి కోరుతూ మాజీ మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ గారు, అమలాపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ గారు గౌరవ జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు.
గత రెండేళ్లుగా ప్రభుత్వం ప్రజలను వంచిస్తోందని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని, మోసాలు, అరాచకాలు, అన్యాయాలకు పాల్పడుతోందని నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో, 'వెన్నుపోటు దినం'గా ప్రజలకు గుర్తుచేస్తూ, ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనగా బైక్ ర్యాలీని నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు గారు, వంటెద్దు వెంకన్నాయుడు గారు, రాష్ట్ర బూత్ కమిటీ కార్యదర్శి ఉండ్రు వెంకటేష్ గారు, పట్టణ అధ్యక్షులు సంసాని నాని గారు, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు జిన్నూరి వెంకటేశ్వరరావు గారు, జిల్లా యువజన విభాగ కార్యదర్శి విత్తనాల మూర్తి గారు, కుంచె స్వామి గారు, ఒగురి విజయ్ గారు, కొటుం శేఖర్ గారు తదితరులు పాల్గొన్నారు.
ర్యాలీ ద్వారా ప్రభుత్వ విధానాలపై తమ నిరసనను వ్యక్తం చేయాలని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయడం లేదని విమర్శించాలని నాయకులు యోచిస్తున్నారు. రాబోయే రోజుల్లో తమ నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.











