ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని ఇండియా కూటమి నాయకులు డిమాండ్ చేశారు. లో సేవ్ డెమోక్రసీ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించి, ఎన్నికల ప్రక్రియపై తమ నిరసన తెలిపారు.
సేవ్ డెమోక్రసీ - ఓట్ బచావో - దేశ్ బచావో నినాదాలతో వైఎస్సార్ జిల్లాలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. గురువారం డీసీసీ కార్యాలయం నుంచి నూతన కలెక్టర్ కార్యాలయం వరకు జరిగిన ఈ ర్యాలీలో ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఇర్ఫాన్ బాషా పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా ఇండియా కూటమి వైఎస్సార్ జిల్లా కన్వీనర్ ఎన్.డి.విజయజ్యోతి తదితర నాయకులు మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో అవకతవకలపై తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకునే నాథుడు లేరని విమర్శించారు.











