కామారెడ్డి జిల్లా మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తలసేమియా వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయ సభ్యులు డాక్టర్ బాలు మాట్లాడుతూ, వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది చిన్నారులు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారని, వారి ప్రాణాలను కాపాడాలంటే ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం వారి జీవితాంతం అవసరమవుతుందని డాక్టర్ బాలు తెలిపారు. వారికి కావలసిన రక్తాన్ని అందజేయడానికి రక్తదాతలు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రక్త కొరత వలన చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి ప్రాణాలను కాపాడేందుకు రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తామని డాక్టర్ బాలు పేర్కొన్నారు.












