అసైన్మెంట్ భూములపై యజమానులకు హక్కు కల్పించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు సర్వగల రవీందర్ మాదిగ తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. కామారెడ్డి జిల్లా, జుక్కల్ నియోజకవర్గంలోని పెద్ద మండల ఎమ్మార్వో రాజశేఖర్ ను మర్యాదపూర్వకంగా కలిసి, అసైన్మెంట్ భూముల యజమానులకు హక్కు పత్రాలు ఇవ్వాలని తహసిల్దార్ రాజశేఖర్ కు వినతి పత్రం సమర్పించారు.
పెద్ద మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని అసైన్మెంట్ భూముల యజమానులకు హక్కు కల్పించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు కోరారు. ప్రభుత్వం చేవెళ్ల డిక్లరేషన్, ముఖ్యమంత్రి అభయహస్తం, ఇందిరా బంధు, ఎస్సీ కార్పొరేషన్ యువ వికాస్, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మాదిగలకు ప్రత్యేక కోట కేటాయించి ఇళ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆర్థిక సహాయం పెంపునకు విజ్ఞప్తి










