రాష్ట్రంలో 38 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఆయా కుల సంఘాలకు కేటాయించిన భవన నిర్మాణాలకు సంబంధించి రూ.88.50 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఈ మేరకు గురువారం మినిస్టర్ క్వార్టర్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వివిధ కుల సంఘాల ప్రతినిధులకు ప్రభుత్వం విడుదల చేసిన జీవో పత్రాలను అందజేశారు.

తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, ఎంపీ సురేష్ షెట్కర్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయ దేవి, మాజీ ఓబీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఇతర కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ సంఘాల ముఖ్య నేతలు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.