ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ విజ్ఞప్తి చేసింది. విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కీలక సూచనలు జారీ చేసింది.
తుఫాన్ కారణంగా విద్యుత్ స్తంభాలు తడిసి ఉండవచ్చు, కాబట్టి వాటిని ముట్టుకోవద్దని సూచించారు. అలాగే, తడిసిన చేతులతో ఎట్టి పరిస్థితుల్లోనూ స్టార్టర్లు, మోటార్లు వంటి విద్యుత్ పరికరాలను తాకరాదని హెచ్చరించారు. విద్యుత్ లైన్లకు చెట్లు లేదా కొమ్మలు తగులుతున్నట్లు గమనిస్తే, వెంటనే సంబంధిత లైన్మెన్ లేదా విద్యుత్ కార్యాలయ సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పార్కులు, స్టేడియాల్లోని విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలి. ఇంట్లో స్విచ్ బోర్డులను తడి చేతులతో తాకరాదు. బయట అమర్చిన లైట్లు నీటితో తడవకుండా జాగ్రత్త పడాలి. విద్యుత్ పరికరాలకు సంబంధించిన ఏ వస్తువునైనా తడి చేతులతో ముట్టుకోకూడదు. చిన్న పిల్లలను విద్యుత్ పరికరాలకు దూరంగా ఉంచాలని సూచించారు.











