బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ సోదరుడు, నటుడు-దర్శకుడు రాజు ఖేర్ తన జీవితంలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల గురించి తాజాగా వెల్లడించారు. ఓ టెలివిజన్ కార్యక్రమం కోసం ఇంటిని విక్రయించి అందులో పెట్టుబడి పెట్టానని, అయితే ఆ కార్యక్రమం ప్రసారం కావాల్సిన ఛానల్ అకస్మాత్తుగా మూతపడటంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నానని ఆయన తెలిపారు.
కొత్తగా ప్రారంభం కానున్న ఛానల్ కోసం లైఫ్ కే లియే కుచ్ భీ కరేగా అనే కార్యక్రమాన్ని రూపొందించినట్లు రాజు ఖేర్ తెలిపారు. ఛానల్ ప్రారంభానికి సంబంధించిన ఒప్పందాలు, కార్యక్రమాల చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే నిర్వాహకులు కనిపించకుండా పోయారని ఆయన పేర్కొన్నారు. తాను ఇంటిని విక్రయించి వచ్చిన డబ్బును ఆ ప్రాజెక్టులో పెట్టుబడిగా పెట్టినట్లు వెల్లడించారు. దీంతో ఆదాయం లేకుండా పోయి అద్దె చెల్లించడం కూడా కష్టంగా మారిందన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆ సమయంలో తన అన్నయ్య అనుపమ్ ఖేర్ తనకు ఆర్థికంగా అండగా నిలుస్తారని భావించానని రాజు ఖేర్ తెలిపారు. అయితే అప్పట్లో అనుపమ్ కూడా సినిమాల్లో మంచి పాత్రల కోసం ఎదురుచూస్తూ కొన్ని అవకాశాలను తిరస్కరిస్తున్నారని ఆయన తెలిపారు. దీంతో తాను ఆశించిన స్థాయిలో సహాయం అందలేదని అప్పట్లో భావించినట్లు ఆయన పేర్కొన్నారు.











