ఆసియా క్రీడలు 2026 పురుషుల టీ20 క్రికెట్లో అఫ్గానిస్థాన్ శుభారంభం చేసింది. గ్రూప్-ఏలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జపాన్‌పై 48 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్ విజయం సాధించింది. నిష్షిన్లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ 129 పరుగులు చేయగా, జపాన్ 81 పరుగులకే ఆలౌటైంది.
ఆసియా క్రీడలు 2026 పురుషుల టీ20 క్రికెట్లో అఫ్గానిస్థాన్ శుభారంభం చేసింది. గ్రూప్-ఏలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జపాన్‌పై 48 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్ విజయం సాధించింది. నిష్షిన్లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో జపాన్ 19.3 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌటైంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అఫ్గానిస్థాన్ బ్యాటింగ్‌లో మొహమ్మద్ అక్రమ్ 34, దర్విష్ రసూలీ 29, మొహమ్మద్ ఇషాక్ 25 పరుగులతో రాణించారు. చివరి నాలుగు ఓవర్లలో అఫ్గాన్ బ్యాటర్లు వేగంగా పరుగులు సాధించడంతో జట్టు 129 పరుగుల స్కోరును నమోదు చేసింది.











